నిన్న గడిచి పోయింది, నేడు ముందు నిలిచింది
గడిచిన నిన్న జ్ఞాపకాలను వదిలిపోయింది
నేటి వర్తమానం నన్ను గుర్తించమంది
ఆగిన గడియారపుముల్లు గతకాలం
ఆగక తిరిగే కాలచక్రం వర్తమానం
నిభాయించలేని నిర్ణయాలు గుర్తొస్తాయి
నిలువెత్తు బాధ్యతలు నిన్ను కలవర పెడతాయి
నీరసపడక నడక మొదలుపెట్టు
నిరాశ వీడడమే నీవెక్కాల్సిన తొలి మెట్టు
కష్ట సుఖాలను ఒకే రాటకి కట్టు
ఇష్టపడి జీవన ప్రయాణం మొదలు పెట్టు
ఓ బంధం ఆనందాల్ని పంచు తుంది
ఓ అనుభవం అశ్రుతర్పణం కోరుతుంది
ఓ చేయూత ఓదార్పు నిస్తుంది
ఓ బాధ్యత కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది
ఓ సహవాసం పాఠాలు నేర్పుతుంది
ఓ సందర్బం అవకాశాలు అందిస్తుంది
ఓ సంకల్పం సిద్దించక మరుగున పడుతుంది
ఓ స్వప్నం సాకారమవుతుంది
రోజులు పగలు రాత్రిళ్లుగా కరిగి పోతాయి
సంవత్సరాలు కాల గర్భంలో కలిసి పోతాయి
కానీ
నవరసాల నూతన సంవత్సరం మరల మొదలౌతుంది
నూతనోత్సహాలుతిరిగి పురుడు పోసుకుంటాయి
నిన్న తిరిగిరాని గతమైతే, నేడు నీ ఆధీనంలో వున్న పెన్నిధి
నీకు నీ వే ప్రేరణ, నీ ప్రయత్న ఫలమే ఆనంద గంగావతరణ
రాశా
No comments:
Post a Comment